Share News

ధ్యానం ఆచరిస్తే ప్రశాంత జీవితం

ABN , Publish Date - May 11 , 2025 | 10:50 PM

ప్రతి ఒక్కరూ ధాన్యం ఆచరిస్తే ప్రశాంత జీవితం పొందవచ్చునని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు.

ధ్యానం ఆచరిస్తే  ప్రశాంత జీవితం
బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న టీజీ వెంకటేశ, గౌరు చరిత

బుద్ధవిగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందదాయకం

రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ

ప్రతిఒక్కరూ ధ్యాన కేంద్ర సేవలను వినియోగించుకోవాలి

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఘనంగా బుద్ధుడి విగ్రహావిష్కరణ

కర్నూలు కల్చరల్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ధాన్యం ఆచరిస్తే ప్రశాంత జీవితం పొందవచ్చునని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని రాఘవేంద్రనగర్‌లోగల దికర్నూలు స్పిరిచ్యువల్‌ సొసైటీ ఆధ్వర్యంలోని బుద్ధా పిరమిడ్‌ ధ్యానకేంద్రంలో ఏర్పాటుచేసిన బుద్ధుని విగ్రహాన్ని టీజీ వెంకటేశ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, బుద్ధా పిరమిడ్‌ కేంద్ర అధినేత, చిత్ర నిర్మాత బ్రహ్మరిషి డాక్టర్‌ బీవీ రెడ్డితో కలిపి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేశ మాట్లాడుతూ బుద ్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన బుద్ధవిగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం ఆనందదాయకమని అన్నారు. మహనీయుల నుంచి స్ఫూర్తి పొందేందుకు వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటామన్నారు. ఎన్నోవేల కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ బీవీ రెడ్డి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని, కర్నూలు నగరంలో మొట్టమొదటి సారిగా పిరమిడ్‌ ధాన్య కేంద్రం ఏర్పాటుకు కృషి చేశారని గుర్తుచేశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ నగర ప్రజలకు పిరమిడ్‌ ధ్యాన కేంద్రం ద్వారా ప్రశాంతమైన జీవనాన్ని తెలియజేస్తూ ముందుకుపోతున్న బీవీ రెడ్డి చేపట్టే ప్రతి కార్యక్రమం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ పిరమిడ్‌ ధ్యాన కేంద్రంలో లభించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బుద్ధా పిరమిడ్‌ ధ్యాన కేంద్రం నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. బుద్ధుని విగ్రహం ఏర్పాటుతో ధ్యాన కేంద్రానికి ప్రత్యేకత సంతరించుకుందన్నారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్త రవీంద్రారెడ్డి, సెట్కూరు సీఈవో వేణుగోపాల్‌, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, న్యాయవాది దాశెట్టి శ్రీనివాసులు, వార్డు టీడీపీ నాయకురాలు శైలజాయాదవ్‌, నాయకులు శ్రీనివాసరావు, జవ్వాజి గంగాధర్‌గౌడ్‌, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గాన్నారు.

Updated Date - May 11 , 2025 | 10:50 PM