సమ్మెలో వైద్యాధికారులు
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:49 PM
రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు సమ్మెబాట పట్టారు.
ఇబ్బందులు పడుతున్నరోగులు
18 రోజులుగా స్టాఫ్ నర్సులే దిక్కు
కొత్తపల్లి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు సమ్మెబాట పట్టారు. దాంతో సరైన వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపల్లి మండలంలో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క పీహెచసీలో ఇద్దరు వైద్యులు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా సమ్మెబాట పట్టడంతో గోకవరం, ఎర్రమటం పీహెచసీలలో స్టాఫ్ నర్సులే రోగులను పరిశీలించి వైద్యచికిత్సలు అందిస్తున్నారు. అయితే కొత్తపల్లి పీహెచసీలో మాత్రం యునాని వైద్యాధికారి వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు నిత్యం పీహెచసీలకు వైద్యం కోసం వస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో కొందరు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తూ జోబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైద్యాధికారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెబాటను విరమింపజేసి గ్రామీణ ప్రాంతాల రోగులకు వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.