Share News

Justice Ravinath Tilhari: మధ్యవర్తిత్వం చక్కటి పరిష్కారం

ABN , Publish Date - Jul 31 , 2025 | 04:48 AM

వివాహ, వ్యాపార సంబంధ వివాదాలకు మధ్యవర్తిత్వం చక్కటి పరిష్కారమని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి పేర్కొన్నారు.

 Justice Ravinath Tilhari: మధ్యవర్తిత్వం చక్కటి పరిష్కారం

  • హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి

అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): వివాహ, వ్యాపార సంబంధ వివాదాలకు మధ్యవర్తిత్వం చక్కటి పరిష్కారమని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి పేర్కొన్నారు. మధ్యవర్తి సమక్షంలో జరిగే చర్చలు గోప్యంగా ఉంటాయని, ఇక్కడలభించే పరిష్కారం శాశ్వతమని తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న మీడియేషన్‌ ఫర్‌ నేషన్‌ క్యాంపెయిన్‌లో భాగంగా మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందిన హైకోర్టు న్యాయవాదులకు బుధవారం ఒక్కరోజు ఓరియంటేషన్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు హాజరయ్యారు. జస్టిస్‌ ఎన్‌.జయసూర్య, జస్టిస్‌ టీసీడీ శేఖర్‌, సీనియర్‌ ట్రైనర్లు అనుజా సక్సేనా, ఎస్‌.అరుణాచలం పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 04:50 AM