Share News

మాంసం.. ఆరోగ్యంతో చెలగాటం..

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:38 PM

బలవర్థకమైన ఆహారం కోసం వైద్యులు పలుసార్లు మాంసాహారాన్ని తినమంటారు.

   మాంసం.. ఆరోగ్యంతో చెలగాటం..

రోడ్లపైనే విక్రయాలు

జోరుగా కల్తీ మాంసం అమ్మకాలు

నిబంధనలకు తూట్లు

పట్టించుకోని అధికారులు

బలవర్థకమైన ఆహారం కోసం వైద్యులు పలుసార్లు మాంసాహారాన్ని తినమంటారు. కానీ ప్రస్తుతం మాంసం తింటే రోగాల బారిన పడే పరిస్థితులు కర్నూలు నగరంలోని నెలకొన్నాయి. మాంసం వ్యాపారులు నిబందనలకు తూట్లు పొడుస్తున్నారు. ఇష్టానుసారంగా మాంసం విక్రయాలు కొనసాగిస్తున్నారు. రోడ్ల మీద జంతువులను వధిస్తున్నారు. అక్కడే అమ్మకాలు జరుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): నగరంలో మాంసం వ్యాపా రులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మాంసం విక్రయాలపై దృష్టిపెట్టాల్సిన మున్సిపల్‌ ప్రజారోగ్య అధికారులు వాటిమాటే మరిచిపోయారు. రోడ్లపైనే జం తువులు వధించి మాంసం విక్రయాలు జరుపుతున్నా అటువైపు కన్నెత్తి చూడటం లేదంటే అతిశయేక్తి కాదు. కల్తీ మాంసం తిని ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా అధికారులు తమకు ఏమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారు.

రెండు జంతు వధశాలలున్నా..

నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లపైనే జంతువులు వధించి మాంసం విక్రయాలు కొనసాగిస్తున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో అధికారికంగా రెండు జంతు వధశాలలున్నాయి. వాటిని టెండర్ల ద్వారా దక్కించుకున్న కాంట్రాక్టర్లు వ్యాపారులకు అద్దెలకిచ్చి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. పశువైద్యాధికారి, మున్సిపల్‌ ఆరోగ్య అధికారి పరిక్షించిన అనంతరమే ఈవధశాలలో పశువులను వధించాలని నిబంధనలున్నాయి. అవేమీ అమలు కావడంలేదు. నగరంలో వందల సంఖ్యలో అనుమతిలేని మాంసం దుకాణాలున్నాయి. షాపుల్లో జంతువులు వధించరాదని నిషేధాజ్ఞలున్నా ఎవరూ పాటించడం లేదు. కబేలా కంటే ఎక్కువశాతం దుకాణాల వద్దే జంతువులు వధిస్తున్నారు.

మాంసం కల్తీచేసి..

నగరపాలక సంస్థ పరిధిలో ప్రజారోగ్యం పరిరక్షించేందుకు 19 ుంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఒక శానిటరీ సూపర్‌వైజర్‌ ఉన్నారు. కొందరు శానిటరీ ఇనస్పెక్టర్లు, అధికారులు మామూళ్లకు అలవాటు పడిన కారణంగా కల్తీ మాంసం విక్రయాలు జోరు గా సాగుతున్నాయన్న విమర్శలున్నాయి. పొట్టేలు మాంసం స్థానంలో కొందరు వ్యా పారులు నిషేధిత జంతువుల మాంసం కల్తీచేసి విక్రయిస్తున్నారు. దీనిని తిన్న ప్రజలు అనారోగ్యాలబారిన పడుతున్నారు.

నిబంధనలు ఇలా:

మాంసం విక్రయించే వ్యాపారి నగరపాలక సంస్థకు ఫీజు చెల్లించి తప్పని సరిగా అనుమతి పొందాలి. కబేలాతో పాటు బయట వధించే ప్రతి జంతువును పశువైద్యాధికారి పరిక్షించాలి. నగరపాలక సంస్థలో ఏళ్ల తరబడి పశువైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉండగా రెండు నెలల క్రితం పశువైద్యాదికారిని నియమించారు.

ఫ ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న జంతువులు వధించరాదు. అనుమతి పొందిన కబేలాలోనే వధించాలి. నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారులు దగ్గరుండి చెడిపోయిన కల్తీమాంసం తొలగించాలి.

నిబంధనలు పాటించడం లేదు

మాంసం వ్యాపారులు నిబందనలు పాటించడం లేదు. నిషేధిత జంతువులు సైతం రోడ్లపై వధించి వాటి మాంసం విక్రయిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ఫ ఎం.శ్రీహర్ష, ప్రగతి సమితి అధ్యక్షుడు, కర్నూలు

Updated Date - Oct 07 , 2025 | 11:38 PM