Share News

మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు

ABN , Publish Date - Sep 30 , 2025 | 12:09 AM

మత్తు పదార్థాల నియంత్రణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజ కుమారి ఆదేశించారు.

 మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : మత్తు పదార్థాల నియంత్రణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజ కుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స హాల్‌లో నిర్వహించిన డ్రగ్స్‌ వద్దు బ్రో.. అనే కార్యక్రమంలో కలెక్టర్‌ మా ట్లాడారు. జిల్లాను మత్తు పదార్థాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాల న్నారు. అనంతరం ఏఎస్పీ మంద జవాలి అల్ఫోన్స మాట్లాడుతూ 2025లో ఇప్పటి వరకు 11 కేసులు నమోదు అవ్వడంతో పాటు సుమారు 17 కిలోలు డ్రగ్స్‌ సీజ్‌ చేశామన్నారు. మత్తు పదార్థాల నివారణ కోసం 1972 టోల్‌ ఫ్రీ నంబరు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా ఔషధ దుకాణాలు ప్రిస్ర్కిప్షన లేకుండా పెయిన కిల్లర్స్‌ విక్రయించకుండా చూడాలని కలెక్టర్‌కు నివేదించారు. అనంతరం మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఈగల్‌ టీమ్స్‌ పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌, ఆయా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 12:09 AM