Special CS Budithi Rajashekar: పంట నష్టం తగ్గించేందుకు చర్యలు
ABN , Publish Date - Oct 28 , 2025 | 05:37 AM
తుఫాన్ నేపథ్యంలో పంటల రక్షణకు రైతులకు సాంకేతి క సలహాలిచ్చి, నష్టాన్ని తగ్గించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి బి. రాజశేఖర్ ఆదేశించారు. వ్య
వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ రాజశేఖర్
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తుఫాన్ నేపథ్యంలో పంటల రక్షణకు రైతులకు సాంకేతి క సలహాలిచ్చి, నష్టాన్ని తగ్గించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఆదేశించారు. వ్యవసా య, ఉద్యాన, పట్టు, మత్స్య, పశుసంవర్థక శాఖల అధిపతులు, జిల్లా అధికారులతో సోమవారం ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత, సున్నిత గ్రామాలను గుర్తించి పంటల్ని రక్షించే దిశగా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమయంలో అధికారుల పనితీరును సమీక్షించడానికి రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని, ఫిర్యాదులు అందిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ మాట్లాడుతూ.. తుఫాన్ హెచ్చరికలపై రైతులకు 69 లక్షల అప్రమత్త సందేశా లు పంపినట్లు తెలిపారు. ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. గాలులకు అరటి, కూరగాయ చెట్లు పడిపోకుండా స్టాకింగ్ కట్టెల ను ఊతంగా పెట్టాలని రైతులకు సూచించినట్లు తెలిపారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ.. పత్తికి తుఫాన్ తాకిడి ఉన్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.