Share News

Youth Employment: మ్యాట్రిక్స్‌తో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం

ABN , Publish Date - Jun 14 , 2025 | 04:13 AM

రాష్ట్ర యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌...

Youth Employment: మ్యాట్రిక్స్‌తో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం

యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు లక్ష్యం

అమరావతి, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, మ్యాట్రిక్స్‌ ఓవర్సీస్‌, నైపుణ్యాభివృద్ధి సంస్థ మధ్య తాడేపల్లిలోని కార్యాలయంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా వెల్డింగ్‌, పైప్‌ ఫిట్టింగ్‌ రంగంలో యువతకు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈడీ డి.మనోహర్‌, మ్యాట్రిక్స్‌ ప్రతినిధి శిజు వర్కీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 04:15 AM