Share News

మాతాశిశు సంక్షేమమే దేశ సౌభాగ్యం

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:50 PM

మాతాశిశు సంక్షేమమే దేశ సౌభాగ్యమని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డా.కేవిఎనఎ్‌స.అనిల్‌కుమార్‌ అన్నారు.

మాతాశిశు సంక్షేమమే దేశ సౌభాగ్యం
గర్భిణులకు పండ్లు పంపిణీ చేస్తున్న జాయింట్‌ డైరెక్టర్‌ డా.అనిల్‌కుమార్‌

కర్నూలు హస్పిటల్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): మాతాశిశు సంక్షేమమే దేశ సౌభాగ్యమని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డా.కేవిఎనఎ్‌స.అనిల్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని పట్టణ ఆరోగ్య కేంద్రం కొత్తపేట వ్యాక్సిన కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవంతో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తగినంత పోషకాహరం తీసుకుంటే తల్లి, గర్బస్థ శిశువుకు సరైన శక్తి అందుతుందన్నారు. లేదంటే రక్తహీనత ఏర్పడుతుందన్నారు. నవజాత శిశు ఆరోగ్య సేవల ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు. డీఎంఅండ్‌హెచఓ శాంతికళ మాట్లాడుతూ తల్లి బిడ్డ ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యునిసెఫ్‌ కన్సల్టెంట్‌ నాగేంద్ర, డీపీఎంఓ డా.ఉమా, డీఐఓ డా.నాగప్రసాద్‌, డెమో శ్రీనివాసులు శెట్టి మెడికల్‌ ఆఫీసర్‌ డా.శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.

ఫ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జాతీయసురక్షిత మాతృత్వ దినోత్సవం నిర్వహించారు. సూపరింటెండెంటు డా.కే.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గర్భిణులు నెలల సమయంలో సరైన పరీక్షలు చేయించుకుని సుఖప్రసవం పొందాలన్నారు. కార్యక్రమంలో సీఎ్‌సఆర్‌ఎంవో డా.వెంకటేశ్వర్లు, గైనిక్‌ విభాగాపు హెడ్‌ డా.శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 11:50 PM