Massive Tractor Rally: పార్టీలకు అతీతంగా అన్నదాత నిధులు
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:02 AM
గతంలో జగన్‌రెడ్డి రూ.15వేలు ఇస్తామని చెప్పి కొంతమందికే ఇచ్చారని, సీఎం చంద్రబాబు పార్టీలకు అతీతంగా రైతులందరికీ ..
రామగిరి, కదిరిల్లో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ
రైతులంతా చంద్రబాబు వెనకే: కందికుంట
ధర్మవరం/రామగిరి, కదిరి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): గతంలో జగన్‌రెడ్డి రూ.15వేలు ఇస్తామని చెప్పి కొంతమందికే ఇచ్చారని, సీఎం చంద్రబాబు పార్టీలకు అతీతంగా రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశారని ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరిలో ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుపై హర్షంవ్యక్తం చేస్తూ రైతులతో కలిసి గురువారం భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సునీత స్వయంగా ట్రాక్టర్ నడిపారు. కాగా, ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలును హర్షిస్తూ కదిరిలో 500 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ వాహనాలకు, రైతులకు డబ్బులు ఇవ్వకున్నా స్వచ్ఛందంగా తరలివచ్చి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారని, ఒక్క పిలుపుతో ఇంతమంది తరలివచ్చారంటే.. అది చంద్రబాబు పాలపై ప్రజలకు ఉన్న నమ్మకమేనని అన్నారు.