Sri Sathya Sai District: అన్నదాతల భారీ ర్యాలీ
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:13 AM
అన్నదాత సుఖీభవ నిధులను ఖాతాల్లో వేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో మంగళవారం రైతులు వెయ్యి ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: అన్నదాత సుఖీభవ నిధులను ఖాతాల్లో వేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో మంగళవారం రైతులు వెయ్యి ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మిట్టబండ ఆంజనేయస్వామి ఆలయం నుంచి వాల్మీకి సర్కిల్ వరకు ర్యాలీ జరిగింది. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నాయకత్వలో జరిగిన ఈ ర్యాలీలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజు విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనలో రైతులకు మద్దతు ధర లేదని, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని చెప్పి మోసగించారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు పంటలకు మద్దతు ధర కల్పించారని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేరని విమర్శలు చేసిన వైసీపీ నేతలు కళ్లు తెరచి రైతులు, ప్రజల ఆనందాన్ని చూడాలన్నారు.
- మడకశిర టౌన్, ఆంధ్రజ్యోతి