Excise Task Force: స్టీల్‌ప్లాంట్ జీఎం ఇంట్లో.. భారీగా విదేశీ మద్యం స్వాధీనం
ABN , Publish Date - Jul 27 , 2025 | 04:58 AM
స్టీల్‌ప్లాంటులో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న రవికుమార్ ఇంట్లో భారీగా విదేశీ మద్యంతోపాటు డిఫెన్స్, ఇతర రాష్ట్రాలకు చెందిన 67 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): స్టీల్‌ప్లాంటులో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న రవికుమార్ ఇంట్లో భారీగా విదేశీ మద్యంతోపాటు డిఫెన్స్, ఇతర రాష్ట్రాలకు చెందిన 67 మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీఎం పాలెంలోని ఎంవీవీ సిటీలో ఫ్లాట్ నంబర్ 8088లో విదేశీ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ ముసలనాయుడు బృందం శనివారం సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఇంట్లో 18 విదేశీ, 16 డిఫెన్స్, ఒడిశా, గోవా మద్యం సీసాలు ఒక్కొక్కటి, తెలంగాణ మద్యం సీసాలు 11, హరియాణ రాష్ట్ర మద్యం బాటిళ్లు ఏడు, మహారాష్ట్రకు చెందినవి రెండు స్వాధీనం చేసుకున్నారు. రవికుమార్ పరారీలో ఉండడంతో గాలిస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
సోషల్ మీడియాలో ఉన్నతాధికారి రాసలీలల వీడియో
స్టీల్‌ప్లాంట్‌లోని ఓ ఉన్నతాధికారి రాసలీలల వీడియో ఒకటి శనివారం సాయంత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను సదరు అధికారే స్వయంగా రికార్టు చేసినట్టు అందులో స్పష్టంగా తెలుస్తోంది. ప్లాంటులోని ఆయన కంప్యూటర్ నుంచే ఇది బయటకు వచ్చిందని సమాచారం. ఇంకొద్ది రోజుల్లో ఆయన పదవీ విరమణ చేయబోతుండగా ఇది బయటపడడం గమనార్హం.