జగన్ హయాంలో ఆర్థిక అరాచకం: నీలాయపాలెం
ABN , Publish Date - Jun 04 , 2025 | 07:47 AM
ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ jagan హయాంలో భారీ ఆర్థిక అవినీతిని తీవ్రంగా విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రూ.4లక్షల కోట్ల అప్పులు తీసుకుని అవి ఉత్పాదక వ్యయాలకు కాకుండా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించిందని తెలిపారు.
‘జగన్ హయాంలో భారీ స్థాయిలో ఆర్థిక అవినీతి జరిగింది. అలాంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వ ఆర్థిక పరిపాలన గురించి మాట్లాడే అర్హత లేదు’ అని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ విమర్శించారు. ‘జగన్ హయాంలో జరిగినంత ఆర్థిక ఆరాచక పాలన ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. వైసీపీ ప్రభుత్వం రూ.4లక్షల కోట్ల అప్పులు చేసి, వాటిని ఉత్పాదక వ్యయాలకు కాకుండా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించింది. దీంతో రాష్ట్రం తీవ్రంగా వెనుకబడిపోయింది. అలాంటి వారు ఇప్పుడు ఆర్థిక ప్రమాణాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది’ అని నీలాయపాలెం విమర్శించారు.