Share News

‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో భారీ అవినీతి

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:37 AM

రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో గత వైసీపీ ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందని ఆళ్ల గడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గళమెత్తారు.

 ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో భారీ అవినీతి

ఫ అసెంబ్లీలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ(శిరివెళ్ల), మార్చి 10(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో గత వైసీపీ ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందని ఆళ్ల గడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గళమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో రూ.120 కోట్లతో క్రీడలు నిర్వహించామని గొప్పలు చెప్పుకున్నారే తప్ప రాష్ట్రంలో క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందించలేదన్నారు. అలాగే నాణ్యతలేని క్రీడా కిట్లను పంపిణీ చేశారన్నారు. పబ్లిసిటీ కోసం తాపత్ర యపడ్డారే గానీ క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి ఏమాత్రం కృషి చేయలేదన్నారు. వివిధ రకాల క్రీడలు నిర్వహించేందుకు రూ.120 కోట్లు ఖర్చు చేశామని చెబుతాన్నారే గానీ వాటికి సంబంధించిన వివరా లు తెలియడం లేదన్నారు. కేవలం పబ్లిసిటీ కోసం రూ.35 కోట్లు ఖర్చు చేశారన్నారు. క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ఇవ్వాల్సిన నగదు ప్రోత్సాహకాలు ఇంకా క్రీడాకారులకు జమ కాలేదన్నారు. విశాఖ పట్టణంలో నిర్వహించిన ముగింపు వేడుకల్లో సైతం భారీగా నిధులు దుర్వినియోగానికి పాల్ప డ్డారని అన్నారు. విశాఖ పట్టణంలో నిర్వహించిన క్రీడలు, విజేతల వివరాల ను ప్రస్తుత శాప్‌ చైర్మన రవి నాయుడును అడగగా గత ప్రభుత్వంలోనే ఆ వివరాలన్నింటిని తొలగిం చినట్లు తెలిసింద న్నారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్ర మంపై సంబంధిత మంత్రి సమగ్రంగా విచారించి నిధుల దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకునేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు.

Updated Date - Mar 11 , 2025 | 12:37 AM