మార్క్‌ఫెడ్ గోదాముల తనిఖీ
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:59 PM
నంద్యాల మండలం అయ్యలూరు మెట్ట సమీపంలోని మార్క్‌ఫెడ్ గోదాములను సోమవారం జిల్లా కలెక్టర్ రాజకుమారిగణియా తనిఖీలు చేపట్టారు.
నంద్యాల ఎడ్యుకేషన, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): నంద్యాల మండలం అయ్యలూరు మెట్ట సమీపంలోని మార్క్‌ఫెడ్ గోదాములను సోమవారం జిల్లా కలెక్టర్ రాజకుమారిగణియా తనిఖీలు చేపట్టారు. గోదాములో నిల్వఉంచిన యూరియా నిల్వలను, ఏయే సంస్థలకు ఎంత సరఫరా చేసిన వివరాలను మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ హరినాధ్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎరువుల దుకాణాల్లో, ప్రాధమిక పరపతి కేంద్రాలు, రైతుసేవాకేంద్రాల్లో యూరియా అమ్మకాలను డీబీటీలో నమోదు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. యూరియా గురించి రైతుల్లో ఉన్న అపోహలను తొలగించాలన్నారు. యూరియా నిల్వలపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.