Chintur: నేటి నుంచి అమరవీరుల వారోత్సవాలు
ABN , Publish Date - Jul 28 , 2025 | 05:56 AM
సోమవారం నుంచి మావోయిస్టుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేరిట లేఖ విడుదలైంది.
చింతూరు, జూలై 27(ఆంధ్రజ్యోతి): సోమవారం నుంచి మావోయిస్టుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేరిట లేఖ విడుదలైంది. ప్రతిఏటా మాదిరిగా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహించ తలపెట్టినట్లు వివరించారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని, పార్టీని విప్లవోద్యమాన్ని కాపాడుకుందామని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఏపీలోని అల్లూరి జిల్లా చింతూరు డివిజను పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానిత ప్రదేశాల్లో నిఘా పెంచారు. వాహనాలను నిలువరించి తనిఖీలు చేస్తున్నారు. రాత్రి వేళలో చింతూరు వైపు నుంచి భద్రాచలం వైపు సాగే రాకపోకలను వయా కూనవరం మీదుగా మళ్లిస్తున్నారు. ఇందులోభాగంగా విజయవాడ జగదల్‌పూర్ జాతీయ రహదారిపై పోలీసులు గట్టి పహారా కాస్తున్నారు.