Share News

Annamayya District: మామిడి లారీ బోల్తా

ABN , Publish Date - Jul 14 , 2025 | 03:51 AM

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం కడప- చెన్నె రహదారి పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువు కట్టపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మామిడికాయల లోడుతో వెళుతున్న లారీ...

Annamayya District: మామిడి లారీ బోల్తా

  • 9 మంది మృతి.. 9 మందికి గాయాలు

  • అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం

పుల్లంపేట, జూలై 13(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం కడప- చెన్నె రహదారి పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువు కట్టపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మామిడికాయల లోడుతో వెళుతున్న లారీ చెరువు కట్టపై ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి బోల్తా పడింది.ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులంతా మామిడికాయలు కోసే కూలీలు. రాజంపేట మండలంలోని మదనగోపాలపురం గ్రామంలోని ఓ తోటలో మామిడికాయలు కోసి వాటిని లారీలో వేసుకుని రైల్వేకోడూరులోని మార్కెట్‌యార్డుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు.మృతులంతా రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Jul 14 , 2025 | 03:52 AM