Manda Krishna: సీజేఐ దళితుడు కాబట్టే..
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:15 AM
సుప్రీంకోర్టు సీజే బీఆర్ గవాయ్‌పై బూటు విసిరి దాడి చేయబోయిన న్యాయవాదిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు....
ఆ న్యాయవాదిని అరెస్టు చేయలేదు: మంద కృష్ణ
చిత్తూరు అర్బన్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు సీజే బీఆర్ గవాయ్‌పై బూటు విసిరి దాడి చేయబోయిన న్యాయవాదిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రశ్నించారు. సీజేఐ దళితుడు అయినందునే దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి వ్యవస్థలు ఆసక్తి చూపించడం లేదన్నారు. ఈ నెల 17న చలో డిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, న్యాయ వ్యవస్థపై గౌరవమున్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి తరలిరావాలని కోరారు.