Organ Donation: చనిపోతూ.. ఏడుగురికి కొత్త జీవితం
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:15 AM
తమ బిడ్డ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పలు ఆస్పత్రుల్లో చూపించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు బ్రెయిన్ డెడ్ అని వైద్యులు తేల్చా రు.
రోడ్డు ప్రమాదంలో గాయాలైన చిత్తూరు వాసి బ్రెయిన్ డెడ్
బాధలోనూ అవయవదానానికి ముందుకొచ్చిన కుటుంబీకులు
వెదురుకుప్పం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): తమ బిడ్డ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పలు ఆస్పత్రుల్లో చూపించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు బ్రెయిన్ డెడ్ అని వైద్యులు తేల్చా రు. అయితే ఇంతటి దుఃఖంలోనూ ఆ కుటుంబం అవయవదానానికి అంగీకరించింది. దీంతో ఆ యువకుడు చనిపోతూ.. ఏడుగురికి కొత్త జీవితాన్నిచ్చాడు. కర్ణాటకలో గతనెల 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌పురం మండలం సింధురాజపురం గ్రామానికి చెందిన నిరంజన్‌కుమార్ చౌదరి (40) తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అక్క డి ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు గత శుక్రవారం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యు లు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అవయవదానంపై వైద్యులు కుటుంబసభ్యులకు అవగాహన కల్పించారు. అంత బాధలోనూ కొందరికైనా జీవితాన్నివ్వాలని నిరంజన్ కుటుంబీకులు భావిం చి.. అవయవదానానికి అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కిడ్నీలు, కళ్లు, లివర్, తదితర అవయవాలను ఏడుగురికి కేటాయించారు. సోమవారం వేకువజామున నిరంజన్ మృతదేహాన్ని తీసుకుని కుటుంబీకులు స్వగ్రామానికి చేరుకున్నారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.