Share News

Amaravati Investment: అమరావతిలో పెట్టుబడులకు సిద్ధం

ABN , Publish Date - Oct 04 , 2025 | 04:31 AM

రాజధాని అమరావతిలో రాబోయే ఐదేళ్లలో రూ.6వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు...

Amaravati Investment: అమరావతిలో పెట్టుబడులకు సిద్ధం

  • ముందుకొచ్చిన మలేషియా పారిశ్రామికవేత్తలు

అమరావతి/తుళ్లూరు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో రాబోయే ఐదేళ్లలో రూ.6వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ముం దుకొచ్చాయి. ఆ దేశ మం త్రి, ఎంపీతో కలిసి పారిశ్రామికవేత్తల బృందం ఈ నెల 1 నుంచి అమరావతిలో పర్యటిస్తోంది. దీనిలో భాగం గా ఉద్యోగులు, మంత్రులు, జడ్జీల భవనాలు, ఐఏఎస్‌, ఐపీఎ్‌సల ఇళ్ల టవర్లను మంత్రి నారాయణతో కలసి బృందం పరిశీలించింది. అనంతరం వెలగపూడి సచివాలయంలో మలేషియా సెలాంగార్‌ స్టేట్‌ ఎక్స్‌కో మంత్రి పప్పారాయుడు, క్లాంగ్‌ ఎంపీ గనబతిరావ్‌, మాలేసియా-ఆంధ్రా బిజినెస్‌ చాంబర్‌ ప్రతినిధులు, పలు ప్రైవేట్‌ సంస్థల ప్రతినిధులతో నారాయణ భేటీ అయ్యారు. అమరావతి అభివృద్ధికి భారత్‌తో కలిసి పనిచేస్తామని మంత్రి పప్పారాయుడు తెలిపారు.

Updated Date - Oct 04 , 2025 | 04:31 AM