మహానాడును విజయవంతం చేయండి
ABN , Publish Date - May 26 , 2025 | 11:56 PM
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కడప జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహిం చే మహానాడు సభలను విజయవంతం చే యాలని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దనరెడ్డి కోరారు.
బనగానపల్లె, మే 26(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కడప జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహిం చే మహానాడు సభలను విజయవంతం చే యాలని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్దనరెడ్డి కోరారు. సోమవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ని యోజకర్గంలోని బనగానపల్లె, అవుకు, కొలి మిగుండ్ల, సంజామల, కోవెలకుంట్ల మండ లాల్లోని అన్ని గ్రామాల క్లస్టర్, యూనిట్, బూత, మండల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు మంగళవారం మాత్రమే హాజరు కావాలని కోరారు. మిగిలిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈనెల 28న బహిరంగ సభకు భారీగా తరలిరావాలన్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఇ బ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మహానాడుకు హాజరై విజయవంతం చేయాలని మంత్రి కోరారు.