లోక్ అదాలతను విజయవంతం చేయండి
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:27 PM
పట్టణంలో వచ్చేనెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలతను విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి శోభారాణి, జూనియర్ సివిల్ న్యాయాధికారి దివ్య సూచించారు.
సీనియర్ సివిల్ న్యాయాధికారి శోభారాణి
నందికొట్కూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో వచ్చేనెల 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలతను విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి శోభారాణి, జూనియర్ సివిల్ న్యాయాధికారి దివ్య సూచించారు. శనివారం పట్టణంలోని కోర్టు ఆవరణలో పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. న్యాయాధికారి శోభారాణి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసుల్లో మధ్యవర్తిత్వం ద్వారా రాజీ చేసుకోవచ్చునన్నారు. పోలీసు అధికారులు కక్షిదారులకు అవగాహన కల్పించి, శాంతియుతంగా ఇరుపక్షాలను ఒకచోట చేర్చి తగాదాలను పరిష్కరించే వేదికగా లోక్ అదాలత వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీపీ సుస్మిత, ఎస్‌ఐలు సిబ్బంది, బార్ అసోసియేషన ప్రెసిడెంట్ శరభయ్య, జూనియర్ , సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.