స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Sep 21 , 2025 | 12:01 AM
స్వచ్ఛ నంద్యాల జిల్లా గా తీర్చిదిద్దాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షే మ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్ అన్నారు.
· మైనార్టీ సంక్షేమ శాఖ
మంత్రి ఎనఎండీ ఫరూక్
· కలెక్టర్‌తో కలిసి
మొక్కలు నాటిన మంత్రి
నంద్యాల టౌన, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ నంద్యాల జిల్లా గా తీర్చిదిద్దాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షే మ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్ అన్నారు. శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా పట్టణంలోని పీవీ నగర్ డంపింగ్ యార్డులో కలెక్టర్ రాజకుమారితో కలిసి మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరు భాగస్వాములు కావాలన్నారు. పరిసరాలను శుభ్రంగా చేసుకోవాలని సూచించారు. జిల్లాలో పచ్చదనం తగ్గపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని కోరారు. అలా కవర్లు వాడే దుకాణాలపై మున్సిపల్ అధికారులు జరిమానా విధించాలని ఆదేశించారు. మురుగు నీరు రోడ్లపైకి కాల్వల్లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని సూచించారు. స్వచ్ఛ లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, చైర్‌పర్సన మాబున్నీసా, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనఎండీ ఫిరోజ్, నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
స్వచ్ఛతతోనే అభివృద్ధి సాధ్యం
ఆత్మకూరు: స్వచ్ఛతతోనే అభివృద్ధి సాధ్యమని ఆత్మకూరు మార్కెట్ యార్డు చైర్మన వంగాల కృష్ణారెడ్డి అన్నా రు. శనివారం స్వర్ణాం ధ్ర.. స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా సింగి ల్ విండో చైర్మన షాబుద్దిన, టీడీపీ మం డల, పట్టణాధ్యక్షులు రవీంద్రబాబు, వేణుగోపాల్‌తో కలిసి ఆత్మకూరులోని ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసి మొ క్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమే్‌షబాబు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన నజీర్‌అహ్మద్, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా, నాయకులు రామ్మూర్తి, నాగూర్‌ఖాన, జనసేన పార్టీ నాయకులు శ్రీరాములు, అరుణ్ తదితరులున్నారు. అలాగే స్థానిక తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణలో బీజేపీ నాయకులు మోమిన షబానా ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్ రత్నరాధిక, డిప్యూటీ తహసీల్దార్ రవణమ్మ, సిబ్బంది తదితరులున్నారు.
నందికొట్కూరు రూరల్ : గ్రామాలు పచ్చదనం పరిశుభ్రతతో కళకళలాడాలని బ్రాహ్మణకొట్కూరు సింగిల్‌విండో సొసైటీ చైర్మన మద్దూరు హరిసర్వోత్తమరెడ్డి అన్నారు. శనివారం బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో మం డల ప్రత్యేక అధికారి సైదా సబేహాపర్వీన, ఎంపీడీవో రంగనాయక్ ఆధ్వర్యంలో స్వచ్ఛతాహీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామం లో చెత్తను తొలగించి మొక్కలను నాటారు. కార్యక్రమంలో సర్పంచ మరియమ్మ, కార్యదర్శి శాంతయ్య, ఏఓ అమరేంద్రుడు, మాజీ సర్పంచ ఖలీలుల్లాబేగ్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
నంద్యాల ఎడ్యుకేషన: మొక్కలను విరివిగా నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ రాజకుమారి అన్నారు. స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటే కా ర్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జేసీ విష్ణుచరణ్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడు తూ సెప్టెంబరులో ఏపీ గ్రీన థీమ్‌లో భాగంగా ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక్క మొక్కను నాటాలని కోరారు. భవిష్యత తరాలకు శుభ్రమైన వాతావరణం కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జూట్ లేదా కాటన బ్యాగులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో రామునాయక్, ఏవో సుభకర్ పాల్గొన్నారు.