Share News

Municipal and Urban Development Dept: పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన

ABN , Publish Date - Nov 24 , 2025 | 06:12 AM

పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ భారీగా ప్రోత్సాహం అందిస్తోంది.

Municipal and Urban Development Dept: పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన

  • మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ప్రకటన

అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ భారీగా ప్రోత్సాహం అందిస్తోంది. 12 రంగాల్లో 2029 నాటికి మొత్తం రూ.66,523 కోట్లు పెట్టుబడులు సమీకరించేందుకు సమాయత్తమైంది. అందుకోసం పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో సమగ్ర వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.30 లక్షల మందికి ఉపాధి సృష్టిస్తామని మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పీపీపీ ప్రాజెక్టులను విజయవంతంగా అమలుచేయడం కోసం ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేశామని, రోడ్‌ మ్యాప్‌ కూడా సిద్ధమైందని, ఈ బ్లూప్రింట్‌ను విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ప్రదర్శించినట్లు వివరించారు.

Updated Date - Nov 24 , 2025 | 06:14 AM