Fire Accident: జిన్నింగ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:05 AM
కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ జిన్నింగ్ పరిశ్రమలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
రూ.2 కోట్లకు పైగా విలువైన పత్తి దగ్ధం
ఆదోని, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ జిన్నింగ్ పరిశ్రమలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలోని బసాపురం రహదారిలో ఉన్న హరి కాటన్ జిన్నింగ్ పరిశ్రమలో మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఎగసిపడి అందులోనే ఉన్న సద్గురు సాయి జిన్నింగ్ పరిశ్రమకు చెందిన పత్తి నిల్వలు కూడా దగ్ధమయ్యాయి. పత్తి పరిశ్రమలో మధ్యాహ్నం సమయంలో పత్తిని జిన్నింగ్ చేస్తుండగా ఒక్కసారిగా నిప్పురవ్వలు పత్తిపై ఎగసిపడటంతో మంటలు వ్యాపించాయి. కార్మికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు రూ.2 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు యాజమాన్యం తెలిపింది.