Nandyal District: రైతు కష్టం నీటిపాలు
ABN , Publish Date - Oct 27 , 2025 | 05:12 AM
వరుస అల్పపీడనాలు, వాయుగుండాలతో గతకొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న తడిసి మొలకలు రావడంతో నంద్యాల జిల్లాలో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్నకు మొలకలు
చాగలమర్రి/రుద్రవరం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): వరుస అల్పపీడనాలు, వాయుగుండాలతో గతకొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న తడిసి మొలకలు రావడంతో నంద్యాల జిల్లాలో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పంట కోతదశకు రావడంతో ఇప్పటికే కొందరు రైతులు కోత కోయగా, మరి కొందరు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. మొక్కజొన్న దిగుబడులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, నూర్పిళ్లు చేసుకొని గిట్టుబాటు ధరకు అమ్ముకోవడం రైతులకు కష్టతరంగా మారింది. దీంతో చాగలమర్రి, రుద్రవరం మండలాల్లోని పలు గ్రామాల రైతులు మొక్కజొన్నను రోడ్లపై ఆరబోశారు. అయితే, గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షానికి మొక్కజొన్న తడిసిపోయి మొలకలు వచ్చాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.