AP Govt: రోడ్ సేఫ్టీకి మాదిరెడ్డి ప్రతాప్
ABN , Publish Date - Jul 26 , 2025 | 05:30 AM
అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతా్‌పను రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది.
అగ్నిమాపక శాఖ ఇన్‌చార్జి డీజీగా వెంకటరమణ
అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): అగ్నిమాపక శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్‌ను రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. అగ్నిమాపక శాఖ డీజీ బాధ్యతలు అత్యంత సీనియర్ డైరెక్టర్ అయిన వెంకటరమణకు అప్పగిస్తూ శుక్రవారం సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం ఏడాది క్రితం విడుదల చేసిన నిధులతో ఫైర్ ఇంజన్లు కొనకుండా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకొంటూ జాప్యం చేసిన మాదిరెడ్డి వ్యవహారం ప్రభుత్వానికి నచ్చలేదు. సిబ్బందిని ఇబ్బంది పెట్టేలా నిర్ణయాలు తీసుకొంటూ అగ్నిమాపక శాఖలో అసహనానికి కారణమయ్యారు. ప్రభుత్వ పెద్దల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న సమాచారంతో మాదిరెడ్డిపై బదిలీ వేటు పడింది. అగ్నిమాపక శాఖ అభివృద్ధి, సిబ్బంది సమస్యలు తెలిసిన వెంకటరమణకు డీజీ ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వడం విపత్తుల స్పందన శాఖకు మేలు చేస్తుందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. మరోవైపు పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఎస్.వి. శ్రీధర్‌రావును సీఐడీలో ఎస్పీగా ప్రభుత్వం నియమించింది.