Share News

‘మత్తు’లోడు ‘మ్యాడీ’

ABN , Publish Date - Sep 03 , 2025 | 01:13 AM

మ్యాడీ... వినడానికి ఈ పేరు చాలా స్టైల్‌గా ఉంది. పైగా విదేశాల్లో వాడుకలో ఉన్న పేరుగా అనిపిస్తుంది. వాస్తవానికి ఈ పేరు అచ్చుతెలుగుదే. మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాల కోసం సృష్టించుకున్న పేరిది. ఈ మ్యాడీ ఎవరో కాదు వైజాగ్‌ ప్రేమికులకు ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీని సమకూర్చిన మల్లె మధుసూదన్‌రెడ్డి. నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్‌రెడ్డి బెంగళూరులో ఉంటూ మాదకద్రవ్యాలను సరఫరా, విక్రయించడం చేస్తున్నాడు. వైజాగ్‌కు చెందిన అర్జా శ్రీవాత్సవ్‌, బొడ్డేపల్లి హవీల డిలైట్‌ డ్రగ్స్‌తో చిక్కడంతో మధుసూదన్‌రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. మాచవరం పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. శ్రీవాత్సవ్‌, హవీల పోలీసులకు పట్టుబడిన తర్వాత మధుసూదన్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. డ్రగ్స్‌ సరఫరాలో ఆరితేరిన అతడు అసలు పేరు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకోసం అతడు ముద్దుగా ఒక పేరును సృష్టించుకున్నాడు. మధుసూదన్‌రెడ్డి పేరును ఇంగ్లీష్‌ రాస్తే వచ్చే మొదటి రెండు అక్షరాలు, చివరి మూడు అక్షరాలు కలిపి ఎంఏడీడీవై (మ్యాడీ) పేరును రూపొందించుకున్నాడు. డ్రగ్స్‌ కోసం సంప్రదింపులు చేసే వారందరికి ఇదే పేరును చెప్పేవాడు.

‘మత్తు’లోడు ‘మ్యాడీ’

తెలుగు రాషా్ట్రల్లో డ్రగ్‌ నెట్‌వర్క్‌

మ్యాడీగా చెలామణి అవుతున్న నెల్లూరుకు చెందిన మధుసూదన్‌రెడ్డి

పేరులో ఉన్న ఇంగ్లీష్‌ అక్షరాల్లో మొదటి రెండు, చివరి మూడు అక్షరాలతో ‘మ్యాడీ’

బెంగళూరులో ఉంటూ డ్రగ్‌ కార్యకలాపాలు

మ్యాడీ కోసం పోలీసుల గాలింపు

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

మ్యాడీ... వినడానికి ఈ పేరు చాలా స్టైల్‌గా ఉంది. పైగా విదేశాల్లో వాడుకలో ఉన్న పేరుగా అనిపిస్తుంది. వాస్తవానికి ఈ పేరు అచ్చుతెలుగుదే. మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాల కోసం సృష్టించుకున్న పేరిది. ఈ మ్యాడీ ఎవరో కాదు వైజాగ్‌ ప్రేమికులకు ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీని సమకూర్చిన మల్లె మధుసూదన్‌రెడ్డి. నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్‌రెడ్డి బెంగళూరులో ఉంటూ మాదకద్రవ్యాలను సరఫరా, విక్రయించడం చేస్తున్నాడు. వైజాగ్‌కు చెందిన అర్జా శ్రీవాత్సవ్‌, బొడ్డేపల్లి హవీల డిలైట్‌ డ్రగ్స్‌తో చిక్కడంతో మధుసూదన్‌రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. మాచవరం పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. శ్రీవాత్సవ్‌, హవీల పోలీసులకు పట్టుబడిన తర్వాత మధుసూదన్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. డ్రగ్స్‌ సరఫరాలో ఆరితేరిన అతడు అసలు పేరు తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకోసం అతడు ముద్దుగా ఒక పేరును సృష్టించుకున్నాడు. మధుసూదన్‌రెడ్డి పేరును ఇంగ్లీష్‌ రాస్తే వచ్చే మొదటి రెండు అక్షరాలు, చివరి మూడు అక్షరాలు కలిపి ఎంఏడీడీవై (మ్యాడీ) పేరును రూపొందించుకున్నాడు. డ్రగ్స్‌ కోసం సంప్రదింపులు చేసే వారందరికి ఇదే పేరును చెప్పేవాడు.

భారీగా ‘తెలుగు’ నెట్‌వర్క్‌

మధుసూదన్‌రెడ్డి రెండు తెలుగు రాషా్ట్రల్లో ఉన్న విద్యార్థులకు, యువకులకు ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌ను భారీగానే సరఫరా చేసినట్టు తెలుస్తోంది. బెంగళూరులోనే ఈ డ్రగ్స్‌ను అందజేయడానికి 10-15 డ్రాపింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసుకున్నాడు. డ్రగ్స్‌ కోసం సంప్రదింపులు చేసిన వారందరిని బెంగళూరుకు పిలిపించుకుంటున్నాడు. పేమెంట్‌ యాప్‌ల ద్వారా డ్రగ్స్‌కు సంబంధించిన చెల్లింపులు పూర్తయిన తర్వాత మాత్రమే సరుకు ఉన్న డ్రాపింగ్‌ పాయింట్‌ను వాట్సాప్‌లో పంపుతాడు. ముఖ్యంగా నగరాల్లో ఉన్న యువతీ యువకులతో మ్యాడీకి సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ విక్రయాలు సాగడానికి రెండు తెలుగు రాషా్ట్రల్లో భారీగా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీవాత్సవ్‌, హవీల చిక్కిన తర్వాత పోలీసులు జోగా లోహిత యాదవ్‌కు సంకెళ్లు వేసిన విషయం తెలిసిందే. అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత స్వరూపరాజు పేరు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే స్వరూపరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతడే కాకుండా లోహితతో చాటింగ్‌, వాట్సాప్‌ కాల్స్‌ చేసిన వారు ఇప్పుడు తలోదిక్కుకు పారిపోతున్నారు. ఈ డ్రగ్స్‌ సరఫరాలో మధుసూదన్‌రెడ్డి ఒక్కడే పాత్ర పోషించాడా, అతడి వెనుక ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. మ్యాడీగా చలామణి అవుతున్న మధుసూదన్‌రెడ్డిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న శ్రీవాత్సవ్‌, హవీల, లోహితను కస్టడీలోకి తీసుకుని విచారించాలన్న యోచనలో పోలీసులు ఉన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 01:13 AM