Weather Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Sep 13 , 2025 | 06:41 AM
ఉపరితల ఆవర్త నం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయ వ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది.
కోస్తాలో వర్షాలు.. 20న ఉపరితల ఆవర్తనం
15 నుంచి నైరుతి నిష్క్రమణ మొదలు
విశాఖపట్నం, అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఉపరితల ఆవర్త నం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయ వ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో ఉత్తరాం ధ్ర, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా, అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. నవగాం(మన్యం జిల్లా)లో 73, పాత కొప్పెర్ల(విజయనగరం)లో 68, సీతంపేట (మన్యం)లో 59.75, భీమునిపట్నం(విశాఖ)లో 55 మి.మీ. వర్షపాతం నమోదైంది. కాగా, అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా, ఈనెల 20న వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాల్లో వర్షాలు కురుస్తాయన్నారు.
రెండు రోజులు ముందే నైరుతి నిష్క్రమణ: ఐఎండీ
నైరుతి రుతుపవనాల నిష్క్రమణ 2 రోజులు ముందే ప్రారంభం కానుంది. ఈ నెల 15 నుంచి పశ్చిమ రాజస్థాన్ నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమణ ప్రారంభం కానుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) బులెటిన్‌లో పేర్కొం ది. ఈ నైరుతి సీజన్‌లో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 778.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 836.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.