TDS on Contractor Payments: టీడీఎస్ లేకుంటే రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం
ABN , Publish Date - Sep 17 , 2025 | 04:18 AM
ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేటప్పుడు వారి నుంచి టీడీఎస్ వసూలు చేయకుండానే మొత్తం బిల్లు ఇచ్చేస్తున్నారని...
కలెక్టర్ల సదస్సులో వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేటప్పుడు వారి నుంచి టీడీఎస్ వసూలు చేయకుండానే మొత్తం బిల్లు ఇచ్చేస్తున్నారని వాణి జ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు.ఏ చెప్పారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఈ బిల్లులపై 18 శాతం పన్నును రాష్ట్రం నష్టపోతోందని వివరించారు. టీడీఎస్ మినహాయింపును పట్టించుకోకుండానే పంచాయతీరాజ్ డీడీవోలు బిల్లులు చెల్లిస్తున్నారని తెలిపారు. వృత్తిపన్ను లక్ష్యం రూ.1000 కోట్లలో సగం సాధించామని తెలిపారు. ప్రభుత్వ పనులకు అవసరమయ్యే డీజిల్, పెట్రోల్‌ను రాష్ట్రంలోనే కొనుగోలు చేయడానికి ఇచ్చిన జీవో వల్ల అదనంగా రూ.2 వేల కోట్ల రాబడి వస్తుందని చెప్పారు.
పొడి చెత్త నిర్వహణకు స్వచ్ఛ రథాలు
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా, పర్యావరణానికి అనుకూలంగా, సుస్థిరంగా మా ర్చేందుకు పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పీఆర్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ అన్నారు. తడి వ్యర్థాలను కంపోస్టుగా మార్చేందుకు హౌస్‌హోల్డ్ కంపోస్ట్ పిట్‌లు, గోబర్దన్ ప్రాజెక్టు కింద గోశాలల్లో బయోగ్యాస్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పొడి చెత్త నిర్వహణలో భాగంగా స్వచ్ఛ రథం మొబైల్ వాహనాలు గుంటూరు, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని వివరించారు.