సరైన ప్రణాళికలు లేకనే ప్రాణ, ఆస్తి నష్టం
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:19 AM
సరైన ప్రణాళికలతో నిర్మాణాలు లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుందని హైదరాబాదు ఐఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ శుభం సింఘాల్ అన్నారు.
హైదరాబాదు ఐఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ శుభం సింఘాల్
పాణ్యం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): సరైన ప్రణాళికలతో నిర్మాణాలు లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుందని హైదరాబాదు ఐఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ శుభం సింఘాల్ అన్నారు. అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ విభాగం ఆధ్వర్యంలో ‘ఇంటర్‌నేషనల్ డిజాస్టర్ రెడిక్షన’ అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులు వంతెనల నిర్మాణాలపై ప్రదర్శించిన సీనఆప్ బ్రిడ్జి పోటీలలో విజేతలకు బహుమ తులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ అశోక్‌కుమార్, డీన రామిరెడ్డి, హెచవోడీ శ్రీనివాసులు, రాజారాం, విద్యార్థులు పాల్గొన్నారు.