Goods Vehicles: నేటి అర్ధరాత్రి నుంచి లారీల సమ్మె
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:27 AM
గూడ్స్ వాహనాలపై ఫిట్‌నెస్ చార్జీలను పాత విధానంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం...
గూడ్స్ వాహనాల ఫిట్‌నెస్ చార్జీలు తగ్గించాలని డిమాండ్
నేటి అర్ధరాత్రి నుంచి లారీల సమ్మె
విజయవాడ(ఆటోనగర్), డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): గూడ్స్ వాహనాలపై ఫిట్‌నెస్ చార్జీలను పాత విధానంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం(ఈనెల 9వ తేదీ) అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్లు న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్(నమ్‌తా) ప్రధాన కార్యదర్శి బొడ్డ శేషగిరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఫిట్‌నెస్ చార్జీలు రూ. 900 నుంచి రూ. 1,400 వరకు మాత్రమే ఉండగా ప్రస్తుతం అవి రూ. 2,300 నుంచి రూ.33 వేల వరకు పెరగడంతో లారీ యజమానులపై తీవ్ర ఆర్థికభారం పడుతోందని పేర్కొన్నారు. గూడ్స్ వాహనాలపై ఫిట్‌నెస్ చార్జీల పెంపు ఉపసంహరించుకోవాలని శేషగిరి డిమాండ్ చేశారు.