Tirumala: సూర్య, చంద్ర ప్రభలపై ఊరేగిన శ్రీనివాసుడు
ABN , Publish Date - Oct 01 , 2025 | 04:58 AM
బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు మంగళవారం శ్రీనివాసుడు సూర్య, చంద్ర ప్రభ వాహనాలపై...
నేడు మహా రథోత్సవం, ముగియనున్న వాహన సేవలు
తిరుమల, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు మంగళవారం శ్రీనివాసుడు సూర్య, చంద్ర ప్రభ వాహనాలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభపై బద్రీనారాయణుడి అలంకారంలో మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహించారు. రాత్రి చంద్ర ప్రభ వాహనంపై నవనీత కృష్ణుడిగా శ్రీమలయప్పస్వామి భక్తులను అనుగ్రహించారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో మరో ప్రధాన వాహనమైన మహా రథోత్సవం (చెక్కతేరు) బుధవారం ఉదయం జరుగనుంది. రాత్రి జరిగే అశ్వ వాహన సేవతో బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు ముగుస్తాయి.