Delhi Visit: నేడు ఢిల్లీకి లోకేశ్
ABN , Publish Date - Dec 15 , 2025 | 05:18 AM
రాష్ట్రమంత్రి లోకేశ్ సోమవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న ఆయన...
రాష్ట్ర సమస్యలపై కేంద్రమంత్రులకు వినతులు
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రమంత్రి లోకేశ్ సోమవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న ఆయన నేరుగా పార్లమెంటు హౌస్‌కు వెళతారు. అక్కడ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై వినతిపత్రాలు అందజేస్తారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేసి మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నానికి చేరుకుంటారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.