లోకేశ్ కృషి అభినందనీయం: అయ్యన్న
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:58 AM
నేపాల్‌లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి మంత్రి లోకేశ్ తీసుకుంటున్న చర్యలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశంసించారు.
అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): నేపాల్‌లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి మంత్రి లోకేశ్ తీసుకుంటున్న చర్యలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశంసించారు. బుధవారం ఈ మేరకు ఆయన ఎక్స్‌లో స్పందించారు. ఆర్టీజీఎ్‌సలో కూర్చొని మంత్రి లోకేశ్ బాధితులతో మాట్లాడుతున్న ఫొటోను పంచుకున్నారు. ‘నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా మన రాష్ట్రానికి వెనక్కి తీసుకురావడమే ఏకైక అజెండాగా, బాధితులతో మాట్లాడుతూ, మీకు అండగా మేం ఉన్నాం... అని ధైర్యం చెపుతున్న మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు. ఆర్టీజీఎస్ కేంద్రంలో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, అవసరమైన చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని లోకేశ్ ఆదేశించారు. నేపాల్లో చిక్కుకుపోయిన వారు ధైర్యంగా ఉండాలి. ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే అధైర్యపడకండి. సహాయం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌ను +91 9818395787, ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్ 24 గంటల సహాయ కేంద్రాన్ని 0863 2340678, ఆర్‌టీజీఎ్‌సను 0863 2381000 ఎక్స్‌టెన్షన్ 8001, 8005 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి’ అని స్పీకర్ సూచించారు.