Share News

PM Modi: ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం

ABN , Publish Date - Sep 06 , 2025 | 04:28 AM

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖల మంత్రి లోకేశ్‌ శుక్రవారం ఢిల్లీలో ప్రధానితో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

 PM Modi: ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం

  • లోకేశ్‌కు ప్రధాని హామీ

  • ‘యోగాంధ్ర’ కాఫీ టేబుల్‌ బుక్‌ను మోదీకి అందించిన మంత్రి

  • రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరించండి

  • ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ పరిశ్రమలకు మద్దతివ్వండి

  • ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలకు మార్గనిర్దేశం చేయండి.. మోదీకి వినతి

  • జీఎ్‌సటీ సంస్కరణలకు సంపూర్ణ మద్దతు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖల మంత్రి లోకేశ్‌ శుక్రవారం ఢిల్లీలో ప్రధానితో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. యోగా దినోత్సవం సందర్భంగా జూన్‌లో రాష్ట్రంలో నిర్వహించిన యోగాంధ్ర వేడుకలపై రూపొందించిన కాఫీ టేబుల్‌ బుక్‌ను ఆయనకు అందజేశారు. సుమారు 45 నిమిషాలు సమావేశం జరిగింది. రాష్ట్రానికి చెందిన కొన్ని ముఖ్య విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో ఇటీవలి పరిణామాలను లోకేశ్‌ ప్రధానికి వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత 15 నెలల్లో కేంద్రం మద్దతు, సహకారంతో అనేక సంక్షేమ, అభివృద్థి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. ‘మీ నేతృత్వంలో వికసిత్‌ భారత్‌-2047లో భాగస్వాములం అవుతాం’ అని చెప్పారు. ప్రగతి దిశగా అడుగులు వేస్తున్న ఏపీలో పెట్టుబడుల ఆకర్షణకు, అభివృద్థి కార్యక్రమాలకు మరింత తోడ్పాటు అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ‘అడ్వాన్స్డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజ్‌’ సెమీకండక్టర్‌ యూనిట్‌ను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.


‘కేంద్ర నిర్ణయం రాష్ట్ర పారిశ్రామికవృద్థికి కీలక మలుపు. అలాగే ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు కేంద్రం నిరంతర సహకారం అందించాలి. తద్వారా రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉపాధి లభించి, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది’ అని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. విద్యా మంత్రిగా చేపడుతున్న విద్యా సంస్కరణల గురించి కూడా వివరించారు. విద్యా ప్రమాణాలను పెంచడానికి, అభ్యాసన ఫలితాల నాణ్యతను మెరుగుపరచడానికి రాష్ట్రప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యలో ఆంధ్రప్రదేశ్‌ మెరుగైన ఫలితాలను సాధించడానికి సాయం చేయడంతో పాటు మద్దతు, మార్గదర్శకత్వం అందించాలని అభ్యర్థించారు. అనంతరం కేంద్రం తాజాగా చేపట్టిన జీఎ్‌సటీ సంస్కరణలకు మద్దతు ప్రకటించి ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సంస్కరణలతో దేశంలోని కోట్లాది మంది నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందన్నారు. ఇవి రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారాల వృద్ధికి మరింత తోడ్పడతాయని.. మధ్యతరగతి ప్రజల్లో మరింత పొదుపును ప్రోత్సహిస్తాయని ప్రధానికి లోకేశ్‌ తెలిపారు.

Updated Date - Sep 06 , 2025 | 04:29 AM