Nara Lokesh: మొత్తం యంత్రాంగం కృషికి దక్కిన గుర్తింపు
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:50 AM
విశాఖలో గూగుల్ పెట్టుబడులపై నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ హర్షం వెలిబుచ్చుతూ ఎక్స్‌లో స్పందించారు.
విశాఖకు గూగుల్‌పై అమితాబ్ కాంత్ స్పందనకు లోకేశ్ ప్రతిస్పందన
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): విశాఖలో గూగుల్ పెట్టుబడులపై నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ హర్షం వెలిబుచ్చుతూ ఎక్స్‌లో స్పందించారు. దానిపై మంత్రి లోకేశ్ స్పందించారు. ఇంత భారీ పెట్టుబడులను సాధించిన ఘనత మొత్తం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి దక్కుతుందని, కేంద్రం నుంచి అద్భుతమైన సహకారం అందడం కూడా ఈ భారీ విజయానికి దోహదపడిందని లోకేశ్ పేర్కొన్నారు. విజనరీ చంద్రబాబు సారథ్యంలో అసాధ్యమైన ఆలోచనలను బిలియన్ డాలర్ల వాస్తవంగా మారుస్తున్నామన్నారు.