Share News

Birthday Wishes: బ్రాహ్మణికి లోకేశ్‌ జన్మదిన శుభాకాంక్షలు

ABN , Publish Date - Dec 22 , 2025 | 05:38 AM

కష్టనష్టాల్లో వెన్నంటి నిలిచిన తన సతీమణి బ్రాహ్మణికి మంత్రి లోకేశ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Birthday Wishes: బ్రాహ్మణికి లోకేశ్‌ జన్మదిన శుభాకాంక్షలు

కష్టనష్టాల్లో వెన్నంటి నిలిచిన తన సతీమణి బ్రాహ్మణికి మంత్రి లోకేశ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘దేవాంశ్‌కు తల్లిగా.. రాక్‌స్టార్‌ సీఈవోగా నీవు నాతో కలిసి నడిచిన ప్రతి అడుగూ ఓ అద్భుతం’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.

దేవదేవుడి కోర్టు నుంచి తప్పించుకోలేరు: లోకేశ్‌

‘పరకామణిలో చోరీపై జగన్‌ స్పందన.. ఆయన దోపిడీ స్థాయిని వెల్లడిస్తోంది. జనం సొమ్ము లక్షల కోట్లు దోచుకున్న జగన్‌కు పరకామణి చోరీ చిన్నదే కావొచ్చు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఈ చోరీ మహాపాపం’ అని మంత్రి లోకేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. సాక్ష్యాధారాల్లేకుండా చేసి తప్పించుకోడానికి ఇది బాబాయి కేసో.. కోడి కత్తి కేసో కాదని, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నకు చేసిన మహా అపచారమని, ఆ దేవదేవుడి కోర్టు నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ట్వీట్‌ చేశారు.

Updated Date - Dec 22 , 2025 | 05:40 AM