Lokesh Criticizes Party Leaders: గ్రీవెన్స్‌ను గాలికొదిలేశారు!
ABN , Publish Date - Nov 05 , 2025 | 04:59 AM
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజూ గ్రీవెన్స్ నిర్వహించాలని చెప్పాం. దాన్ని ఎవ్వరూ సక్రమంగా పాటించడం లేదు. శని, ఆదివారాలు మినహా మిగిలిన రోజులన్నీ ఒక మంత్రి పార్టీ కార్యాలయానికి వచ్చి...
పార్టీ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలే
మీరు సరిగా నిర్వహిస్తే ఈ ఒక్కరోజే 5 వేల మంది వస్తారా?
పార్టీ నేతలపై లోకేశ్ ఆగ్రహం
సొంత ఇమేజ్‌తో గెలిచామనుకునే వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలవచ్చు
పార్టీ పరిణామాలపై లోకేశ్ సుదీర్ఘ చర్చ
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజూ గ్రీవెన్స్ నిర్వహించాలని చెప్పాం. దాన్ని ఎవ్వరూ సక్రమంగా పాటించడం లేదు. శని, ఆదివారాలు మినహా మిగిలిన రోజులన్నీ ఒక మంత్రి పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలన్న ఆదేశాన్ని కూ డా పట్టించుకోవడంలేదు. నియోజకవర్గాల్లో వారం లో ఏదో ఒక రోజు ప్రజాదర్బార్ నిర్వహించాలని చెప్పాం.. దాన్ని కూడా పాటించడం లేదు. ఇలా అయితే ఎలా? పార్టీ ఆదేశాలను నిర్లక్ష్యం చేసే వారి ని ఏమనాలి? ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందే’ అని టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన పార్టీ కార్యకలాపాలపై నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రీవెన్స్ నిర్వహణను గాలికొదిలేశారంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు గ్రీవెన్స్ నిర్వహణ సరిగా చేస్తే నేను వచ్చిన రోజు 5,000 మంది వచ్చే అవకాశం ఉండేది కాదు. ఇకపై గ్రీవెన్స్ విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తాం. ఎవరైనా నిర్ల క్ష్యం చూపితే సీరియస్ చర్యలు ఉంటాయి. ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో ఎంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు గ్రీవెన్స్ నిర్వహించారో నాకు నివేదిక ఇవ్వండి’ అని లోకేశ్ ఆదేశించారు.
ఎంతటివారికైనా పార్టీనే సుప్రీం
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చిన్ని వివాదంపై లోకేశ్ స్పందిస్తూ... ‘క్రమశిక్షణ విషయంలో టీడీపీ పెట్టింది పేరు. దాన్ని చెడగొట్టేలా ఏ స్థాయి నాయకుడు ప్రవర్తించినా చర్యలకు ఉపేక్షించేది లేదు. ఎవరికైనా పార్టీనే సుప్రీం. పార్టీ లేకుంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు లేరు.పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటేనే మంత్రి పదవులైనా, కార్పొరేషన్ పదవులైనా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని నడుచుకోవాలి. పార్టీ లైన్ దాటి విమర్శలు, ఆరోపణ లు చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. పార్టీని బేఖాతరు చేసే వారు, తమ సొంత ఇమేజ్ తో గెలిచామనుకునే వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలవచ్చు. తిరువూరు వివాదంపై నివేదికను బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు నా కూ ఇవ్వండి. చంద్రబాబు లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు.
సీనియర్ చనిపోతే ఇంటికి కూడా వెళ్లరా..!
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉదంతంపైనా లోకేశ్ సీరియస్ అయ్యారు. కావలిలో సుదీర్ఘకాలం పార్టీకి సేవలందించిన సుబ్బానాయుడు విషయంలో ఎమ్మెల్యే తీరు సరిగా లేదన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి ఫరూక్‌ని కార్లో కూర్చోబెట్టుకుని కృష్ణా రెడ్డి వారిని కూడా తప్పుగా ప్రొజెక్ట్ చేశారని ఆరోపించారు. కావలిలో జరిగే సుబ్బానాయుడు కార్యక్రమానికి తానుకూడా వస్తున్నట్లు స్ప ష్టం చేశారు. ‘పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఓ కంట కనిపెట్టి ఉండాల్సిన బాధ్యత మీపై ఉంది’ అని పల్లాకు లోకేశ్ తేల్చి చెప్పారు. ఆర్టీసీ కార్పొరేషన్ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావును ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘జోగి రమేశ్ బీసీ కార్డు వాడి టీడీపీపైనా, చంద్రబాబుపైనా విమర్శలు చేస్తూ రెచ్చిపోతుంటే మీరంతా ఏం చేస్తున్నా రు? కులం కార్డు తీసిన వెంటనే మీరు స్పందించాల్సిన పని లేదా? సీనియర్లు ఎవరికి వారు స్వతహాగా నిర్ణయాలు తీసుకుని స్పందించాలి. పార్టీ స్ట్రాటజీ కమిటీ కూడా ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల విమర్శలను గమనిస్తూ కౌంటర్‌లు సిద్ధం చేయాలి’ అని లోకేశ్ ఆదేశించారు.