Nara Lokesh: కార్యకర్తల బాధ్యత నాది
ABN , Publish Date - May 22 , 2025 | 06:33 AM
టీడీపీ నేత బాలకోటిరెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటానని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి, జీవితాంతం అండగా ఉంటానని తెలిపారు.
ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటా: లోకేశ్.. బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులకు భరోసా
అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): ‘తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత నేను తీసుకుంటా. ఇంటికి పెద్ద కొడుకులా అండగా ఉంటా’ అని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. వైసీపీ గూండాల చేతిలో హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను బుధవారం ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. లోకేశ్‌ను కలిసిన వారిలో బాలకోటిరెడ్డి భార్య నాగేంద్రమ్మ, సోదరుని కుమారులు నరసింహారెడ్డి, రామకృష్ణారెడ్డి ఉన్నారు. బాలకోటిరెడ్డిని హత్య చేసిన నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వారిని కఠినంగా శిక్షించాలని వారు లోకేశ్‌ను కోరారు. తాము ఆర్థికంగా చాలా నష్టపోయామని, ఉపాధి హామీ, గృహ నిర్మాణం బిల్లులు పెండింగ్‌లో ఉండటంతోపాటు తమ ఇల్లు కూడా తాకట్టులో ఉందని తెలిపారు. లోకేశ్ మాట్లాడుతూ బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని, పెండింగ్ బిల్లులు చెల్లించి, తాకట్టు నుంచి ఇంటిని విడిపిస్తానని హామీ ఇచ్చారు. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి