Dallas Visit: డల్లాస్ చేరుకున్న లోకేశ్
ABN , Publish Date - Dec 07 , 2025 | 04:33 AM
ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా చేపట్టిన తన అమెరికా పర్యటనలో భాగంగా శనివారం ఉదయం డల్లాస్ చేరుకున్నారు.
ఘన స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు
నేడు ‘తెలుగు డయాస్పోరా’తో ప్రసంగం
(డల్లాస్ నుంచి కిలారు గోకుల్ కృష్ణ)
ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా చేపట్టిన తన అమెరికా పర్యటనలో భాగంగా శనివారం ఉదయం డల్లాస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్నారై టీడీపీ శ్రేణులు, కూటమి అభిమానులు ఘన స్వాగతం పలికారు. శనివారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి) లోకేశ్ డల్లా్‌సలోని గార్లాండ్‌లో ప్రవాసాంధ్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ‘తెలుగు డయాస్పోరా’ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసినందుకు ప్రవాసాంధ్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపేందుకు ఈ వేదికను వినియోగించుకోనున్నారు.
రేపటి నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోలో..
ఏపీ ఎగుమతులు-దిగుమతుల వాణిజ్యాన్ని బలోపేతం చేసే పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో లోకేశ్ సోమ, మంగళవారాల్లో శాన్‌ఫ్రాన్సిస్కోలో పర్యటిస్తారు. ఆయన పర్యటన ఏర్పాట్లను ఏపీ ఎన్‌ఆర్‌టీ చైర్మన్ డాక్టర్ వేమూరు రవికుమార్, ఎన్నారై టీడీపీ సమన్వయకర్త కోమటి జయరాం, లోకేశ్ నాయుడు కొణిదెల, రాజా పిల్లి, సతీశ్ మండువ తదితరులు సమన్వయం చేస్తున్నారు.