Minister Lokesh: క్రీడాభివృద్ధికి ప్రపంచ స్థాయి సదుపాయాలు
ABN , Publish Date - Aug 30 , 2025 | 04:55 AM
రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన సదుపాయాలను కల్పిస్తామని లోకేశ్ అన్నారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవానికి....
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన సదుపాయాలను కల్పిస్తామని లోకేశ్ అన్నారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర క్రీడాకారుల రక్తంలోనే నైపుణ్యం, క్రమశిక్షణ, అంకితభావం ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచానికి ఏపీని క్రీడల రాజధానిగా చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదవ లేదన్నారు. తగిన ప్రోత్సాహం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలు అందించేవారు తయారవుతారని స్పష్టం చేశారు. విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దే బాధ్యతను క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు తీసుకోవాలని సూచించారు. అనంతరం అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఎర్రాజి జ్యోతి, సాకేత్ మైనేని, కోనేరు హంపి, రజని, జ్యోతికశ్రీ, షేక్ జెఫ్రిన్, శివారెడ్డి, సత్యగీతతో పాటు గోపీచంద్, ఎంఎస్‌కే ప్రసాద్‌ను ఆయన ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, మంత్రులు రాంప్రసాదరెడ్డి, వంగలపూడి అనిత, డోలా శ్రీబాలరామాంజనేయస్వామి, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు, శాప్ చైర్మన్ రవినాయుడు, సీఎండీ గిరీశా, తదితరులు పాల్గొన్నారు.