Party Meeting: కడప జిల్లాలో లోకేశ్, జగన్
ABN , Publish Date - Sep 02 , 2025 | 06:22 AM
కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో మంత్రి లోకేశ్ మంగళవారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సీకేదిన్నె గ్రామంలో స్మార్ట్ కిచెన్ సెంటరును...
కడప/పులివెందుల, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో మంత్రి లోకేశ్ మంగళవారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సీకేదిన్నె గ్రామంలో స్మార్ట్ కిచెన్ సెంటరును, అనంతరం పెండ్లిమర్రిలో గవర్నమెంటు డిగ్రీ కాలేజీని ప్రారంభిస్తారు. తరువాత కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌లో రూ. 50 కోట్లతో నిర్మించిన టెక్స్‌నో ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ, రూ.120 కోట్లతో నిర్మించిన టెక్స్‌నోడ్రమ్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కమలాపురం పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం 6.10కి కడప ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు తిరిగి వెళతారు. లోకేశ్ సోమవారం రాత్రి కడపకు చేరుకుని ఇక్కడి భారత్ ఇంజనీరింగ్ కాలేజీలో బస చేశారు.
పులివెందులకు జగన్..
తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ సీఎం జగన్ సోమవారం పులివెందుల చేరుకున్నారు. తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ చేపట్టారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక తీరుపై ఆరా తీశా రు. ఎన్నికల్లో పోరాడకుండా టీడీపీకి సరెండర్ అయ్యారం టూ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా, మంగళవారం ఉదయం 7.30 సమయంలో ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద జగన్ నివాళులు అర్పించ నున్నా రు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సోమవా రం సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. మంగళవారం వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించనున్నారు.