Local Elections: ఈవీఎంలతోనే స్థానిక ఎన్నికలు!
ABN , Publish Date - Sep 10 , 2025 | 05:55 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలకా్ట్రనిక్ ఓటింగ్ మిషన్ల(ఈవీఎం) ద్వారా చేపట్టనున్నారు..
అందుబాటులో 10,670 ఈవీఎంలు
రాష్ట్రానికి మరిన్ని అవసరమని అంచనా
పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల కమిషనర్లతో ఎస్‌ఈసీ సాహ్ని భేటీ
అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలకా్ట్రనిక్ ఓటింగ్ మిషన్ల(ఈవీఎం) ద్వారా చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖ కమిషనర్లు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎ్‌సఈసీ) నీలం సాహ్నితో మంగళవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో 1.36 లక్షల వార్డుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున ప్రతి వార్డ్‌కు ఒక ఈవీఎంను వాడాల్సి ఉంటుంది. విడతల వారీగా నిర్వహించే ఈ ఎన్నికలకు ఎన్ని ఈవీఎంలు అవసరమవుతాయన్న అంశంపై చర్చించారు. ఇతర రాష్ట్రాల నుంచి అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ఎంత మేరకు అవకాశముంది?. తదితర విషయాలపై చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు 41,301 కంట్రోల్ యూనిట్‌లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించారు. అయితే, కేంద్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల్లో కూడా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈవీఎలంకు సంబంధించి సమాచారం సేకరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 10,670 ఎం-2 మోడల్ ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయి. కేంద్రం స్థానిక ఎన్నికల కోసం ఎస్-3 మోడల్‌ను ప్రతిపాదిస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఈవీఎంలను కొనుగోలు చేయడమా? లేక ఇతర రాష్ట్రాల నుంచి అద్దె ప్రాతిపదికన తీసుకుని వాడుకోవడమా? ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే ఈవీఎంలు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో మన రాష్ట్రంలో కూడా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు.