Share News

లిక్కర్‌ స్కామ్‌ విచారణలో స్పీడ్‌ పెరిగింది: అనిత

ABN , Publish Date - Aug 04 , 2025 | 05:04 AM

రాష్ట్రంలో లిక్కర్‌ స్కామ్‌పై విచారణలో స్పీడ్‌ పెరిగిందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.

లిక్కర్‌ స్కామ్‌ విచారణలో స్పీడ్‌ పెరిగింది: అనిత

శ్రీకాకుళం, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లిక్కర్‌ స్కామ్‌పై విచారణలో స్పీడ్‌ పెరిగిందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం ఆమె శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి, శ్రీకూర్మనాథస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అరసవల్లిలో మంత్రి మాట్లాడుతూ ‘‘ఏడాది కాలంలో పోలీసు వ్యవస్థలో ఎన్నోమార్పులు తెచ్చాం. గత ప్రభుత్వ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయితే.. పోలీసు వ్యవస్థతోపాటు ఇతర వ్యవస్థల్లోనూ సంస్కరణలు తెచ్చాం. రాష్ట్రాన్ని గంజాయి రహిత ఏపీగా మార్పు చేసేందుకు ‘ఈగల్‌ టీమ్‌’ను తీసుకువచ్చాం. మహిళల భద్రత కోసం శక్తి యాప్‌ను ప్రవేశపెట్టాం. పోక్సో కేసుల విషయాల్లో కన్విక్షన్‌ రేటు పెరిగింది. ఆరు నెలల్లోనే విచారణ పూర్తయి.. శిక్షలు పడుతున్నాయి. లిక్కర్‌ స్కామ్‌లో చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అని అన్నారు.

Updated Date - Aug 04 , 2025 | 05:05 AM