Minister Kolusu Parthasarathy: లిక్కర్ స్కాంలో ఎంత పెద్దవారున్నా చర్యలు తప్పవు
ABN , Publish Date - Jul 31 , 2025 | 05:14 AM
లిక్కర్ స్కాంలో చట్టం తన పని తాను చేసుకుని వెళుతుంది. ఇందులో ఎంత పెద్దవారున్నా చర్యలు తప్పవు అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతోంది: మంత్రి కొలుసు
కళ్యాణదుర్గం, జూలై 30(ఆంధ్రజ్యోతి): ‘లిక్కర్ స్కాంలో చట్టం తన పని తాను చేసుకుని వెళుతుంది. ఇందులో ఎంత పెద్దవారున్నా చర్యలు తప్పవు’ అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని చాపిరి గ్రామంలో బుధవారం నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’లో ఆయన పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో కలసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అనంతరం రచ్చబండ వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘కూటమి ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవు. రాష్ట్రాని కి, రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించిన ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదు. లిక్కర్ కేసులో ఎంతపెద్ద నాయకులున్నా, చర్యలు ఉంటాయి. సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతోంది. సీఎం చంద్రబాబు నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్నారు.’ అని మంత్రి కొలుసు అన్నారు.