Minister Satyakumar: పాత్రధారులైపోయారు... ఇక సూత్రధారుల వంతు
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:51 AM
లిక్కర్ స్కామ్‌లో పాత్రధారులు అయిపోయారు. ఇక సూత్రధారుల వంతు రాబోతుంది అని మంత్రి సత్యకుమార్ అన్నారు.
రప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారు: మంత్రి సత్యకుమార్
విజయవాడ(గాంధీనగర్), జూలై 25(ఆంధ్రజ్యోతి): ‘లిక్కర్ స్కామ్‌లో పాత్రధారులు అయిపోయారు. ఇక సూత్రధారుల వంతు రాబోతుంది’ అని మంత్రి సత్యకుమార్ అన్నారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచంలోనే ఇది అతిపెద్ద స్కామ్. ప్రజాధనం దోచుకోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారు. కల్తీ మద్యం తాగి వేలాది మంది మంచాన పడ్డారు. చీప్ లిక్కర్ తాగి కిడ్నీలు చెడిపోయిన వారి సంఖ్య 91 వేలకు, లివర్ పాడైన వారి సంఖ్య 14 వేల నుంచి 20 వేలకు, పక్షవాతం కేసులు 7,700లకు చేరాయి. ఈ స్కామ్ దర్యాప్తును దారి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. గతంలో వైసీపీ నేత కేతిరెడ్డి ఉదయం తిరిగి సాయంత్రం ఖాళీ స్థలాలను కబ్జాలు చేసేవాడు. ఇప్పడు అ అవకాశం లేక అమరావతిపై వ్యాఖ్యలు చేస్తున్నాడు’ అని మంత్రి అన్నారు.