Share News

TDP Leader Yanamala: హంతకుడికన్నా ఆర్థికనేరగాడితోనే ప్రమాదం

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:57 AM

మద్యం కుంభకోణంలో జగన్‌ దోచుకున్న రూ.3,500 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేయాలని టీడీపీ...

TDP Leader Yanamala: హంతకుడికన్నా ఆర్థికనేరగాడితోనే ప్రమాదం

  • మద్యం స్కాంలో రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేయాలి: యనమల

అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో జగన్‌ దోచుకున్న రూ.3,500 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేయాలని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ఓ ప్రకటనలో కోరారు. హత్య చేసిన వ్యక్తి కంటే ఆర్థిక నేరస్థుడు చాలా ప్రమాదకరమని, ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కూడా చెప్పిందన్నారు. మద్యం కుంభకోణంలో మిథున్‌రెడ్డిది మాస్టర్‌ మైండ్‌ అయితే, ప్రధాన లబ్ధిదారుడు జగనే అన్నారు. మద్యం కేసును కక్షపూరిత కేసని వైసీపీ నేతలు చెప్పటం నేరం నుంచి తప్పించుకునేందుకే నిందితులు ఆడే మైండ్‌ గేమ్‌గా యనమల అభివర్ణించారు. జగన్‌, అతని అనుచరులు అవినీతితో కోటీశ్వరులైతే... రాష్ట్రం అప్పుల పాలైందని అన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 04:57 AM