Anticipatory Bail: మద్యం కేసులో ముందస్తు బెయిలివ్వండి
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:20 AM
మద్యం కుంభకోణం కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితులు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ...
వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ పిటిషన్లు
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితులు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి(ఏ-2), ఎక్సైజ్ శాఖ మాజీ ప్రత్యేకాధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్(ఏ-3) వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు శుక్రవారం విచారణకు రాగా.. ఇద్దరు పిటిషనర్లూ దర్యాప్తునకు సహకరిస్తున్నారని.. అప్రూవర్లుగా మారాలని భావిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. సీఐడీ నుంచి కౌంటర్లు అవసరం లేదని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరాలు తెప్పించుకుంటే సరిపోతుందన్నారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి.. వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశించారు. విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేశారు.