Share News

Liquor Scam: లిక్కర్‌ నిందితుల పిటిషన్లుపై విచారణ వాయిదా

ABN , Publish Date - Aug 21 , 2025 | 05:23 AM

మద్యం కుంభకోణంలో నిందితులు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, పైలా దిలీప్‌, సజ్జల శ్రీధర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్లపై ..

Liquor Scam: లిక్కర్‌ నిందితుల పిటిషన్లుపై విచారణ వాయిదా

విజయవాడ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో నిందితులు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, పైలా దిలీప్‌, సజ్జల శ్రీధర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్లపై విచారణ గురువారానికి వాయిదా పడింది. బాలాజీ కుమార్‌ యాదవ్‌, నవీన్‌కృష్ణ బెయిల్‌ పిటిషన్లపై విచారణ 22వ తేదీకి వాయిదా పడింది. లిక్కర్‌ కేసులో రూ.11 కోట్లు సీజ్‌ వ్యవహారంలో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కూడా కోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఇంటి నుంచి ఏ పూట భోజనం ఆ పూట అనుమతించాలని ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ 26కు, బాలాజీ కుమార్‌ యాదవ్‌ అరెస్టు సమయంలో సీజ్‌ చేసిన రూ.3 లక్షలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ 21కి, వెంకటేశ్‌నాయుడు మొబైల్‌ ఫోన్‌ను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలన్న సిట్‌ పిటిషన్‌పై విచారణ 25కి వాయిదా పడ్డాయి. తనకు ఇంటి నుంచి వారంలో మూడు రోజులపాటు అనుమతిస్తున్న భోజనానికి సంబంధించి వారాలను మార్చాలని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా పడింది.

Updated Date - Aug 21 , 2025 | 05:23 AM