Share News

లిక్కర్‌ స్కాంలో ఎంతటి వారైనా జైలుకే: గొట్టిపాటి

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:49 AM

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చోటుచేసుకున్న లిక్కర్‌ స్కాంలో ప్రమేయం ఉన్న ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందేనని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు.

లిక్కర్‌ స్కాంలో ఎంతటి వారైనా జైలుకే: గొట్టిపాటి

ఇంటర్నెట్ డెస్క్: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చోటుచేసుకున్న లిక్కర్‌ స్కాంలో ప్రమేయం ఉన్న ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందేనని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు. సోమవారం ఒంగోలులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌ విజయ్‌కుమార్‌తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘వైసీపీ పాలకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. జే బ్రాండ్‌ వలన ఎందరో ప్రాణాలు కోల్పోయారు’ అని మంత్రి ఆరోపించారు.

Updated Date - Jul 22 , 2025 | 04:49 AM